‘టేకులపల్లిని కరువు మండలంగా ప్రకటించాలి’
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని టేకులపల్లి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని బీఆర్ఎస్ నాయకుడు లక్కినేని సురేందర్ రావు డిమాండ్ చేశారు. ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొంటున్నప్పటికీ టేకులపల్లి మండలాన్ని కరువు మండలాల జాబితాలో...
టేకులపల్లి, అక్టోబర్ 28 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని టేకులపల్లి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని బీఆర్ఎస్ నాయకుడు లక్కినేని సురేందర్ రావు డిమాండ్ చేశారు. ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొంటున్నప్పటికీ టేకులపల్లి మండలాన్ని కరువు మండలాల జాబితాలో చేర్చకపోవడం దారుణమన్నారు. మండలంలో నెలకొన్న వ్యవసాయ పరిస్థితులను ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కరువు మండలాల ఎంపికపై వ్యవసాయ శాఖ అధికారులను ప్రశ్నించగా, శాటిలైట్ ఆధారంగా మండలాలను గుర్తించినట్లు తెలిపారన్నారు. అయితే టేకులపల్లి మండలంలోని వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు బొమ్మెర్ల వరప్రసాద్, భూక్య దల్ సింగ్ నాయక్, బర్మావత్ శివకృష్ణ, ఆమెడ రేణుక, కుమ్మరి కిరణ్, తేజావత్ రవి, మౌలానా, రవి నాగభూషణం, పూజారి వెంకట్, బుర్రి వెంకట్ పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘టేకులపల్లిని కరువు మండలంగా ప్రకటించాలి’
Aadarsha Kutumbam | ‘ఆదర్శ కుటుంబం’ టికెట్ బుకింగ్స్ ప్రారంభం.. ఈ శుక్రవారం నుంచే థియేటర్లలో సందడి!
World Telugu Sahithi Conference | చైనాలో ఘనంగా 10వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు
రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలి : ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి
Back Pain Problem | యువతను అధికంగా వేధిస్తున్న నడుము నొప్పి సమస్య.. హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు..
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

