టేకులపల్లి, ఏప్రిల్ 25 : టేకులపల్లి మండల కేంద్రంలోని శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి ఆరాధన మహోత్సవాల సందర్భంగా గ్రామ సర్పంచ్ బోడా బాలు నాయక్ ఆలయ అభివృద్ధికి తన వంతు సహాయంగా రూ.25,000 విరాళం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి కోసం తనవంతు ఐదు సంవత్సరాల పాటు సహాయం కొనసాగిస్తానని తెలిపారు. గ్రామ ప్రజలు, భక్తుల సహకారంతో ఆలయాన్ని మరింత అభివృద్ధి పరచాలని ఆకాంక్షించారు. ఆలయ కమిటీ సభ్యులు సర్పంచ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.