జూలూరుపాడు, ఆగస్టు 23 : సీపీఎస్ అంతమే ఉపాధ్యాయుల పంతం అని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బోడ కృష్ణ అన్నారు. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు జూలూరుపాడు మండలంలో పనిచేస్తున్న ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు శనివారం సిపిఎస్ కు వ్యతిరేకంగా నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జూలూరుపాడు నందు జరిగిన నిరసన కార్యక్రమంలో బోడ కృష్ణ పాల్గొని మాట్లాడారు. సిపిఎస్ ను అంతం చేసే వరకు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు కలిసి పోరాడాలన్నారు.
సుమారు 30 నుండి 35 సంవత్సరాలు ప్రభుత్వానికి సేవ చేసినందుకు గాను ఇచ్చే పెన్షన్ను ఇవ్వకుండా తీసుకువచ్చిన జీఓ నెంబర్ 28ను రద్దు చేసే వరకు పోరాడాలన్నారు. అలాగే ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నరసయ్య, శ్రీనివాసరావు, ఉమా, శాంత కుమారి, గురుమూర్తి, రామనాథం, అరుణ కుమారి, ఉమామహేశ్వరి, వెంకటేశ్వర్లు, లలిత, పటేల్, సునీత, జి.వి.ఆర్ ప్రసాద్, శకుంతల, నాగ రమేశ్ పాల్గొన్నారు.