– మంత్రి పొంగులేటికి కృష్ణసాగర్, ముసలిమడుగు ప్రజాప్రతినిధుల వినతి
బూర్గంపహాడ్, సెప్టెంబరు 04 : సీతారామ ప్రాజెక్టు కెనాల్ నుండి కృష్ణసాగర్ చెరువుకు సాగునీటిని నింపాలని రాష్ట్ర రెవెన్యూ, ఆర్ధిక, సమాచారశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ముసలిమడుగు, కృష్ణసాగర్ పంచాయతీల ప్రజాప్రతినిధులు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. లక్ష్మీపురంలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన ఆయనకు కృష్ణసాగర్ ఉప సర్పంచ్ భూక్యా మోహన్రావు, ముసలిమడుగు సర్పంచ్ పూనెం సురేంద్ర రెండు పంచాయతీల రైతుల తరఫున సీతారామ కెనాల్ నుంచి చెరువుకు నీటిని నింపి రెండు పంటలు పండించుకునే అవకాశం కల్పించాలని కోరారు. దీనికి స్పందించిన మంత్రి సంబంధిత అధికారులకు నీటి సరఫరా విషయమై మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారన్నారు. తొలుత మంత్రి మాజీ ఉప సర్పంచ్ పోతిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి కుమారుడి వివాహానికి ఇటీవల రాలేకపోవడంతో ఆయన నివాసానికి వెళ్లి నూతన దంపతులను ఆశీర్వదించారు. వినతిపత్రం అందించిన వారిలో వార్డు సభ్యులు ఇర్పా శ్రీకాంత్, రైతులు పాల్గొన్నారు.