చుంచుపల్లి, అక్టోబర్ 14 : లెవన్ జాతీయ స్థాయి క్రికెట్ పోటీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నరసరావుపేట పల్నాడు జిల్లాలో నిర్వహించారు. ఈ టోర్నమెంట్లో జూనియర్ కేటగిరిలో తెలంగాణ క్రీడాకారులు రెండో స్థానం సాధించారు. దేశానికి ప్రాతినిధ్యం వహించేందుకు ఇండో -నేపాల్ టోర్నమెంట్ కు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన స్వర్ణ భారతి హై స్కూల్ విద్యార్థులు ప్రేమ చంద్, సంకేత్, నిరంజన్ ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ శైలజ వెల్లడించారు. విద్యార్థులను పాఠశాల యాజమాన్యం మంగ|ళవారం అభినందించింది. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ రాహుల్, పీఈటీ ఫణి కుమార్, విద్యార్థుల తల్లిదండ్రులు, టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది పాల్గొన్నారు.