రామవరం, సెప్టెంబర్ 03 : కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధి రామవరం వన్నందాస్ గడ్డ శాఖ వన్ సీపీఐ కార్యదర్శి సూరిమేనేని జనార్ధన్ మరణం పార్టీకి తీరని లోటు అని కొత్తగూడెం ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జిల్లా కార్యదర్శి ఎస్కే షాబీర్ పాషా అన్నారు. వన్నం దాస్ గడ్డ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కౌన్సిల్ సభ్యులు మునిగడప వెంకటేశ్వర్లు, రామవరం బ్రాంచ్ కార్యదర్శి మర్రి గోపి అధ్యక్షతన బుధవారం ఏర్పాటు చేసిన సంస్మరణ సభలోవారు మాట్లాడారు. అనంతరం ఆయన స్నేహితులు సూరినేని కుటుంబానికి రూ.30 వేలు ఆర్థిక సాయం చేయగా పోస్ట్ ఆఫీస్లో ఫిక్స్డ్ చేసిన పుస్తకాలను ఎమ్మెల్యే వారి కుటుంబ సభ్యులకు అందించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాథం, కల్లూరు వెంకటేశ్వర్లు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు సరిగంటి శ్రీనివాస్, జిల్లా కార్యవర్గ సభ్యులు కంచర్ల జములయ్య,ఫయుం, జిల్లా కౌన్సిల్ సభ్యులు మునిగడప వెంకటేశ్వర్లు, మునిగడప పద్మ, రామవరం బ్రాంచ్ కార్యదర్శి మర్రి గోపి కృష్ణ, ప్రజా సంఘాల నిర్మాణ కార్యదర్శి తూముల శ్రీనివాస్, రామారం బ్రాంచ్ డివిజన్ కార్యదర్శి మండల రాజు, సహాయ కార్యదర్శి గుత్తుల శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ యూసఫ్, బోయిన విజయ్, సత్యనారాయణ చారి, సీనియర్ నాయకులు టూ ఇంక్లైన్ శాఖ కార్యదర్శి మహమ్మద్ అంకుష్, సర్పంచ్ గుగులోత్ నగేష్, ఉప సర్పంచ్ సింగిరాల రమేష్, ఆది మల్లయ్య, బయ్యన ఈశ్వరయ్య, దాట్ల శ్రావణ్, కొరిమి సురేష్,, సావటి స్వామి, ఖయ్యుం, ఎస్కే జలీల్, మర్రి కృష్ణ, తొగరునరేందర్, కమల్, జి శంకర్, గంటాడి కోటేశ్వరరావు, అజ్మీరా బాలాజీ నాయక్, అల్లకొండ గోపి, దిలీప్, ఎర్రవల్లి శంకర్, మహిళా సంఘం నాయకురాలు కే,రత్నకుమారి, మహబూబి,షాహిన్, మద్దెల విజయలక్ష్మి కైసర్, కుటుంబ సభ్యులు సూరిమేని రామారావు, సూరి మేని భాను ప్రకాష్, స్నేహితులు దిండిగాల సాయిలు, శంకర్ పాల్గొన్నారు.