బూర్గంపహాడ్, జూలై 07 : జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2027-28 విద్యా సంవత్సరంలో 6వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైందని, ఈ ప్రవేశ పరీక్షను తెలుగు, ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని బ్రిలియంట్ నవోదయ కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు బీఎన్ఆర్ మంగళవారం తెలిపారు. నవోదయ ఎంట్రన్స్ పరీక్షకు ఈనెల 31వ తేదీవరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని, నవంబర్ 28న ఎంట్రన్స్ పరీక్ష ఉంటుందని, విద్యార్థులు ప్రవేశ పరీక్షపై అవగాహన పెంచుకునేందుకు కోచింగ్ సెంటర్ను సందర్శించవచ్చన్నారు. పూర్తి వివరాలకు 9866283566, 8142652005లను సంప్రదించాలని బీఎన్ఆర్ కోరారు.