బూర్గంపహాడ్, సెప్టెంబరు 07 : విద్యార్ధులు క్రమశిక్షణతో కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని బూర్గంపహాడ్ ఎంపీడీవో జమలారెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామంలో ప్రభుత్వం అందించిన స్కూల్ యూనిఫాంను సర్పంచ్ బానోతు సరోజ చేతులమీదుగా ఎంపీడీవో జమలారెడ్డి, ఎంఈవో యదుసింహరాజుతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం పాఠశాలల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తుందని, యూనిఫాంతో పాటు అన్ని సదుపాయాలు కల్పిస్తుందని విద్యార్థులు కష్టపడి చదివి అనుకున్న లక్ష్యాలను సాధించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.