టేకులపల్లి, సెప్టెంబర్ 24 : అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని టేకులపల్లి సీఐ బత్తుల సత్యనారాయణ, బోడు ఎస్ఐ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. టేకులపల్లి మండలంలోని సంపత్‌నగర్ సమీపంలోని వాగును బుధవారం వారు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇసుకను వాగు నుండి అక్రమంగా రవాణా చేయడం నేరమని, అనుమతులు లేకుండా ఇసుకను తోడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇందిరమ్మ ఇండ్ల పేరుతో ఇసుకను అక్రమంగా రవాణా చేయొద్దని, అక్రమ రవాణా చేస్తే కేసులు నమోదు చేస్తామని సీఐ తెలిపారు.