బూర్గంపహాడ్, జూన్ 05 : బూర్గంపహాడ్ మండల పరిధిలోని అంజనాపురం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు రాష్ట్రస్థాయిలో ఉత్తమ పర్యావరణ పాఠశాల అవార్డు దక్కింది. హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలో పాఠశాల హెచ్ఎం టి.కిషన్‌రావు ఈ అవార్డును రాష్ట్ర దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా శుక్రవారం అందుకున్నారు. రాష్ట్ర స్థాయిలో మూడు పాఠశాలలకు అవార్డులు వస్తే అందులో అన్ని అంశాల్లో ఎంపీపీఎస్ అంజనాపురం పాఠశాల ప్రథమ ర్యాంక్ సాధించడం గర్వకారణం. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు టి.బాబూరావు, ఎస్.శంకర్, ఎస్.సునీత, బి.పద్మ పాల్గొన్నారు.