చుంచుపల్లి, జులై 11 : జ్ఞాన వ్యాప్తితోనే సమాజంలో మానవతా విలువలు పెంపొందించవచ్చని జమాతే ఇస్లామి హింద్ రుద్రంపూర్ రామవరం అధ్యక్షుడు మాజిద్ రబ్బానీ అన్నారు. పెనగడప పంచాయతీలోని గౌతంపూర్ ప్రభుత్వ పాఠశాలల్లో చదివి పాఠశాల స్థాయిలో ప్రతిభ కనబరిచిన చరిత శ్రీ, శ్రావ్య, నాగలక్ష్మి విద్యార్థినులకు జమాతే ఇస్లామి హింద్ తరుపున సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జమాతే ఇస్లామి హింద్ కుల మతాలకు అతీతంగా ప్రతియేటా విద్యా జాగృతి ఉద్యమంలో భాగంగా పేద విద్యార్థులు చదువుకునేలా ప్రోత్సాహిస్తుందని తెలిపారు.
ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినులకు జమాత్ సభ్యులు అబ్దుల్ బాసిత్ కూతురు సాదియా జ్ఞాపకార్థం మెమొంటోలు, తాటిపల్లి సేవా ట్రస్ట్ సహకారంతో నూతన దుస్తులు అందజేశారు. ఈ సందర్భంగా హెచ్ఎం చంద్రశేఖర్ మాట్లాడుతూ.. దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జమాత్ సభ్యులు మౌలానా అంజత్, హమీద్, షబ్బీర్, షమీం, తాజుద్దీన్, షేక్ అబ్దుల్ బాసిత్, మన్హా షహరీష్, టీచర్లు కరీముల్లా, శాంతి శ్రీ, శశికళ, బాలు, శ్రీనివాస్ పాల్గొన్నారు.