రామవరం, ఆగస్టు 04 : కొత్తగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మిగిలిన సీట్ల భర్తీకి ఈ నెల 11వ తేదీన స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పాలీసెట్ 2025లో ఉత్తీర్ణులైనవారు, పాలీసెట్ రాయని వారు పదో తరగతిలో ఉత్తీర్ణులై ఉన్న విద్యార్థులు (మొదటి ప్రాధాన్యత పాలీసెట్ రాసిన వారికి ఉంటుంది) ఈ నెల 5 నుండి 10వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు ఫారంతో పాటు అన్ని సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలను జత చేయాలని సుచించారు. వివరాలకు కళాశాలలో సంప్రదించాలని, స్పాట్ అడ్మిషన్లు పొందినవారు తప్పనిసరిగా ఒరిజినల్ టీసీతో పాటు ఇతర ద్రువపత్రాలతో హాజరు కావాలని పేర్కొన్నారు.