చుంచుపల్లి, ఆగస్టు 25 : దివ్యాంగ విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు క్రీడా పోటీలు నిర్వహించాలని చుంచుపల్లి మండల విద్యాధికారిణి నీరజ అన్నారు. మంగళవారం జీహెచ్ఎస్ బాబూక్యాంప్లో భవిత సెంటర్ ఆధ్వర్యంలో దివ్యాంగ బాలబాలికలకు మండల స్థాయి క్రీడా పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు ఎనిమిది రకాల క్రీడా పోటీలను నిర్వహించారు. విజేతలైన విద్యార్థులకు ఎంఈఓ నీరజ, పాఠశాల హెచ్ఎం చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో భవిత సెంటర్ ఉపాధ్యాయులు పి.సిధయ్య, ఆర్.సంతోష్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
బూర్గంపహాడ్లోని గౌతాపురం ఎంపీపీఎస్ భవిత సెంటర్లో దివ్యాంగులకు మండల స్థాయిలో ఆటల పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంఈఓ యదుసింహరాజు ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. దివ్యాంగ విద్యార్థులకు పరుగుపందెం, క్యారమ్స్, బాతు నడక, కప్ప గంతులు తదితర విభాగాల్లో నిర్వహించిన ఆటల పోటీలను తిలకించి గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మందా నాగరాజు, కాంప్లెక్స్ హెచ్ఎంలు రవీలాదేవి, ఉషారాణి, ఎంపీపీఎస్ పాఠశాల హెచ్ఎం పద్మావతి, శ్రీదేవి, ఏఏపీ చైర్మన్ రమణ, ప్రత్యేక ఉపాధ్యాయులు వీరేష్, కల్యాణి, దివ్యాంగుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.

దివ్యాంగ విద్యార్థులకు క్రీడా పోటీలు