హైదరాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ( BRS MLAs ) అడిగే ప్రశ్నలకు,లేవనెత్తే అంశాల కు సమాధానాలు చెప్పలేకే వారిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ ( Suspended ) చేశారని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్, ఎంపీ వద్దిరాజు ( MP Vaddiraju ) అన్నారు. ప్రజల కిచ్చిన 420 హామీలు,6 గ్యారంటీలు,13 డిక్లరేషన్లను అమలు పర్చడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘోరంగా విఫలమయ్యారని ఆరోపించారు.
ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పట్ల రోజురోజుకు ఆదరణ పెరుగుతుండడంతో దిక్కుతోచని స్థితిలో అధికార పక్షం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నాలు కొనసాగిస్తున్నదని విమర్శించారు.అసెంబ్లీ సమావేశాలు ముగిసే వరకు సభ్యులను సస్పెండ్ చేయడం తీవ్ర గర్హనీయమని అన్నారు.
అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తామని కాంగ్రెస్ నాయకులు గొప్పలు చెప్పి, 33 నెలలు,1000 రోజులు గడిచినా కూడా ఏ ఒక్క విషయంలో కూడా మాట నిలుపుకోలేదని పేర్కొన్నారు. అసెంబ్లీలోకి అడుగుపెట్టనివ్వ కుండా అడ్డుకున్నప్పటికీ కాంగ్రెస్ సర్కార్ తప్పుడు విధానాలను బీఆర్ఎస్ ప్రజాక్షేత్రంలో ఎండగడుతుందని స్పష్టం చేశారు.