రామవరం, మే 03 : పనిచేసే వారికి సమాజంలోనూ, సంస్థలోనూ ప్రత్యేక గుర్తింపు ఉంటుందని అలాంటి వ్యక్తుల్లో కళ్యాణ్ ఒకడని కొత్తగూడెం ఏరియా సివిల్ ఏజీఎం సీహెచ్ రామకృష్ణ అన్నారు. శనివారం ఏరియాలోని సివిల్ కార్యాలయంలో ఓవర్సీర్స్ గా విధులు నిర్వహిస్తున్న పసుపులేటి కళ్యాణ్ తెలంగాణ ప్రభుత్వం 2022లో టీఎస్ పీఎస్ ద్వారా నిర్వహించిన ఏఈ, జేటిఓ పరీక్షలో ఉత్తీర్ణుడై ఆర్ అండ్ బీ లో జేటీఓ గా ఎంపికై వెళ్తున్నందున ఆయనకు కాంట్రాక్టర్లు శనివారం సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ కళ్యాణ్ అందరితో కలుపుగోలుగా ఉంటూ పనుల పట్ల చిత్తశుద్ధిగా వ్యవహరించడమే కాకుండా అంకితభావంతో పనిచేసి అందరు మన్ననలు అందుకున్నట్లు తెలిపారు. భవిష్యత్‌లో కూడా ఇదే స్ఫూర్తితో పనిచేసి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాక్షించారు. ఈ కార్యక్రమంలో సివిల్ డివైస్ ఎస్ఈ అచ్యుతరామయ్య, రాజారాం, సూపర్వైజర్ శ్రీనివాస్, ఆఫీస్ సిబ్బంది మోహన్, ఉమర్, కాంట్రాక్టర్లు గుట్టకింద శ్రీనివాస్, కృష్ణారెడ్డి, సంపత్‌రెడ్డి, గూడెల్లి యాకయ్య, ఈశ్వర్, శివ, క్రాంతి, కుమారస్వామి, షకీల్, మహబూబ్ పాషా, అనిల్ పాల్గొన్నారు.