టేకులపల్లి అక్టోబర్ 24: కార్తీక మాసం పురస్కరించుకొని కొత్తగూడెం డిపో నుండి అన్నవరం పంచారామాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ రాజ్యలక్ష్మి ఒక ప్రకటనలో తెలియజేశారని విలేజ్ బస్ ఆఫీసర్ (విబీవో) ఇస్నాపల్లి శామ్యూల్ తెలిపారు. కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల కేంద్రంలో కార్తీకమాసం సందర్భంగా పంచరామాలుకు ప్రత్యేక బస్ సర్వీసుల పోస్టర్ను శుక్రవారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ఈ నెల 26 ఆదివారం రాత్రి 9 గంటలకు పంచారామాలు, అన్నవరం బస్సులు బయలుదేరతాయని, అన్నవరంకు డీలక్స్ సర్వీసు పంచారామాలకు సూపర్ లగ్జరీ సర్వీసులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ అవకాశాన్ని టేకులపల్లి మండల ప్రజలు ఉపయోగించుకోవాలని తెలిపారు. మరిన్ని వివరాలకు ఫోన్ నెంబర్ 90103 74644 సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో టేకులపల్లి మండలం నుండి నోముల. భాను చందర్, గురుమూర్తి, సతీష్, సుధీర్ కిషోర్ పాల్గొన్నారు.