– 4 ఇంక్లైన్ 33.550 కిలోల కాపర్ వైర్ పట్టివేత
రుద్రంపూర్, సెప్టెంబర్ 03 : కాపర్ వైర్ తరలిస్తున్న ఆటో ట్రాలీని ఎస్&పీసీ సిబ్బంది గురువారం పట్టుకున్నారు. ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ అభిలాష్ తెలిపిన వివరాల ప్రకారం.. సెక్యూరిటీ ఆఫీసర్ అభిలాష్ ,జూనియర్ ఇన్స్పెక్టర్ టి.కామరాజు ఆధ్వర్యంలో సిబ్బంది మల్లికార్జునరావు, హనోక్ రాజు, జనార్ధన్, సుధాకర్ గురువారం మధ్యాహ్నం 4 ఇంక్లైన్ ప్రాంతం నుండి అనుమానాస్పద వస్తున్న ట్రాలీని ఆపేందుకు ప్రయత్నించారు. అయితే డ్రైవర్ ఆపకుండా వెళ్లిపోవడంతో సిబ్బంది వెంబడించి త్రీ ఇంక్లైన్ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. ట్రాలీని తనిఖీ చేయగా 33.550 కిలోల కాపర్ వైర్ లభ్యమైంది. ట్రాలీ, డ్రైవర్‌తో పాటు కాపర్ వైర్‌ను కొత్తగూడెం ఏరియాఎస్&పీసీ కార్యాలయానికి తరలించారు. విచారణ అనంతరం కాపర్ వైర్‌ను కొనుగోలు చేసి తరలిస్తున్న వ్యక్తిని టూటౌన్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. ఘటనపై పోలీసులు తదుపరి విచారణ చేపట్టారు.