రామవరం, మే 19 : కొత్తగూడెం ఏరియాలోని మైన్స్ రెస్క్యూ స్టేషన్‌ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ బి.రోహిత్ రాజు సోమవారం సందర్శించారు. ముందుగా ఆయనకు ఏరియా ఎస్ ఓ టు జీఎం జీవి కోటిరెడ్డి స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా మైన్స్ రెస్క్యూ స్టేషన్ నందు రెస్క్యూ ఆపరేషన్ కి సంబంధించిన పరికరాల గురించి మైన్స్ రెస్క్యూ స్టేషన్ ఇన్చార్జి అనంత రామయ్యను ఎస్పీ అడిగి తెలుసుకున్నారు. అలాగే సింగరేణి నందు, ఇతర ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్ చేసిన సమయంలో ఏ ఏ జాగ్రత్తలు తీసుకుంటారో, రెస్క్యూ ఆపరేషన్ కి వెళ్లేవారు ఎటువంటి రక్షణ పాటిస్తారో క్లుప్తంగా వివరించారు.
ఇంతకు ముందు జరిగిన సంఘటనలు గురించి, చాకచక్యంగా చేపట్టిన పనుల గురించి ఎస్పీ తెలుసుకుని రెస్క్యూ టీమ్‌ని అభినందించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ అబ్దుల్ రెహమాన్, సీఐ రమేశ్ కుమార్, ఎస్బీ సీఐ చెన్నూరు శ్రీనివాస్, ఏరియా ఎస్టేట్స్ ఆఫీసర్ బి.తౌరియా, ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ యు.అభిలాష్, మైన్స్ రెస్క్యూ స్టేషన్ సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొన్నారు.