రామవరం, అక్టోబర్ 24 : వీకే ఓసిలో బొగ్గు వెలికితీత సింగరేణి కార్మికులతోనే తీయించాలని, అదేవిధంగా జీకే ఓసి మూతపడిన తర్వాత జెవిఆర్ ఓసికి డిప్యుటేషన్ పై పంపిన కార్మికులను వెంటనే తిరిగి పేరెంట్ మైన్ వికే ఓసికి తీసుకు రావాలని కొత్తగూడెం ఏరియా ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి వి.మల్లికార్జున్ రావు అన్నారు. శుక్రవారం కొత్తగూడెం ఏరియా వీకే ఓసిలో కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఓసి మేనేజర్ మురళిని కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వీకే ఓసిలో పంప్ ఆపరేటర్ యాక్టింగ్ చేస్తున్న కార్మికులకు పర్మినెంట్ డిసిగ్నేషన్ ఇవ్వాలని, సమస్యలు వెంటనే పరిష్కరించకపోతే ఉద్యమిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వికే ఓసి పిట్ కార్యదర్శి ఎం ఆర్ కె ప్రసాద్, మెంగన్ రవి, కోటి, ప్రభాకర్, కార్మికులు పాల్గొన్నారు.