రామవరం, ఏప్రిల్ 15 : టీబీజీకేఎస్ సెంట్రల్ కమిటీ మెంబర్, కాంట్రాక్ట్ కార్మికుల హక్కుల పరిరక్షణ సంఘ అధ్యక్షుడు రాసూరి శంకర్ సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. శంకర్ మృతితో కార్మిక లోకం శోకసముద్రంలో మునిగింది. ఆయన మృతికి సంతాపంగా కొత్తగూడెం ఏరియా కాంట్రాక్ట్ కార్మికులు స్వచ్ఛందంగా విధులకు గైర్హాజరై నల్ల బ్యాడ్జీలు ధరించి సంతాపం ప్రకటించారు.
కొత్తగూడెం కార్పొరేటర్, ఇల్లందు మణుగూరు ఏరియాకు చెందిన కాంట్రాక్ట్ కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి మౌనం పాటించారు. రాసూరి మరణ వార్త తెలిసిన సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని సింగరేణి ఉద్యోగులు పి వి కే 5 ఇంక్లైన్, ఆర్ సి హెచ్ పి, ఏరియా వర్క్ షాప్ వివిధ డిపార్ట్మెంట్లు ఆయనకు సంతాప సూచికంగా మౌనం పాటించాయి.
Singareni : రాసూరి శంకర్‌కు సింగరేణి కార్మికుల నివాళి