కొత్తగూడెం సింగరేణి, మే 02 : ఐఎన్టీయూసీ కాంట్రాక్ట్ కార్మిక సంఘం, కొత్తగూడెం రీజినల్ జనరల్ సెక్రటరీ ఆల్బర్ట్కు ఈ ఏడాది శ్రమశక్తి అవార్డు లభించడం ఆయన కృషికి దక్కిన గౌరవంగా భావిస్తున్నామని ఐఎన్టీయూసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ త్యాగరాజన్ అన్నారు. శుక్రవారం కొత్తగూడెంలోని ఐఎన్టీయూసీ కార్యాలయంలో ఆల్బర్ట్కు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆల్బర్ట్ విధుల్లో చేరినప్పటి నుంచి ఐఎన్టీయూసీ యూనియన్ బలోపేతానికి విశేష కృషి చేసినట్లు కొనియాడారు. ఆయన కృషికి నిదర్శనమే ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం మే డే సందర్భంగా హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో జరిగిన వేడుకలో శ్రమశక్తి అవార్డును ప్రధానం చేసినట్లు తెలిపారు.
ఈ అవార్డు ఆయనకు దక్కిన గౌరవంతో పాటు తామందరికి దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఐఎన్టీయూసీ కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ చిదంబరం పీతాంబరం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ రజాక్, సీనియర్ నాయకులు బోటిక రాజేశ్వరరావు, మధుసూదన్ రావు, జి.సత్యనారాయణ, సాయి శ్రీనివాస్ రెడ్డి, ప్రసన్న, ఎం. శ్రీనివాస్, జయ రాజేశ్వరరావు, నాగిరెడ్డి, కాంటాక్ట్ కార్మిక సంఘం కొత్తగూడెం ఏరియా అధ్యక్షుడు కాల నాగభూషణం, మణుగూరు జాన్ పాల్గొన్నారు.