ఇల్లెందు : సీఎం కేసీఆర్ హయాంలో వేములవాడ గ్రామంలో కొత్త రేషన్ షాపును నిర్మించినా ప్రారంభించకపోవడంపై ఆదివాసి గిరిజన మహిళలు ధర్నా చేశారు. అనంతరం ఇల్లందు ఎమ్మార్వో కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చారు. ఇల్లెందు మండలం చల్ల సముద్రం గ్రామపంచాయతీ పరిధిలోని వేములవాడ గ్రామంలో రేషన్ షాపు లేదు. దాంతో అక్కడి ఆదివాసి గిరిజన మహిళలు రేషన్ కోసం ప్రతి నెల దూరం వెళ్లాల్సి వస్తోంది. ఇది స్థానిక గిరిజన మహిళలకు ఇబ్బందికరంగా మారింది.
ఈ క్రమంలో వేములవాడలో నిర్మించిన జీసీసీ నూతన రేషన్ షాపును వెంటనే ప్రారంభించాలని స్థానికులు నిరసన తెలిపారు. అనంతరం ఇల్లెందు తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చల్ల సముద్రం గ్రామపంచాయతీ పరిధిలో కేసీఆర్ హయాంలో జీసీసీ వాళ్లు నిర్మించిన నూతన భవనం ఖాళీగా ఉందని, ఆ భవనంలో వెంటనే రేషన్ షాపును ప్రారంభించి, రేషన్ విచ్చేలా చూడాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వేములవాడ గిరిజన మహిళలు పాల్గొన్నారు.