చంద్రుగొండ, ఏప్రిల్ 2 : జాతీయస్థాయి భగవద్గీత ఆన్లైన్ కంఠస్థ పోటీల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ గ్రామవాసి పసుమర్తి శిల్ప ప్రతిభ కనబరిచి బంగారు పథకాన్ని సాధించింది. గత నెల 11న కర్ణాటక రాష్ట్రం మైసూర్ గణపతి సత్యానంద స్వామి దత్తపీఠం నిర్వహించిన పోటీల్లో శిల్పా 18 అధ్యాయాలు 700 శ్లోకాలను అలవోకగా కంఠస్థం చేసి అందరిని ఆశ్చర్య పరిచింది. బుధవారం నాడు హైదరాబాద్లో గణపతి సచ్చిదానంద స్వామి చేతుల మీదుగా గోల్డ్ మెడల్ అందుకుంది. ఈ సందర్భంగా ఆమెను పలువురు అభినందించారు.