కరకగూడెం, మే 20 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలోని సైడ్ కాల్వలు మురుగునీరుతో అధ్వానంగా మారడంతో ‘మురికి కూపం… ప్రజలకు శాపం’ అనే శీర్షికన మంగళవారం నమస్తే తెలంగాణలో వార్త కథనం ప్రచురితం అయ్యింది. కాలువలో మురుగునీరు చేరి దర్వాసనతో పాటు దోమల వ్యాప్తితో తరచూ స్థానికులు అనారోగ్యానికి గురువుతున్నారని కనీస మౌలిక సదుపాయాలు కల్పించండి అని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నా పాలకులు, అధికారులు పట్టించుకోవడం లేదని కథనం ప్రచురితం కాగా వెంటనే స్పందించిన పంచాయతీ అధికారులు బుధవారం ఉదయం పారిశుధ్య కార్మికులతో కాల్వలో పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని తొలిగించి శుభ్రం చేయించారు. దీంతో నమస్తే తెలంగాణ కథనానికి అధికారులు స్పందించడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

కరకగూడెంలో మురుగు కాల్వలు శుభ్రం