బూర్గంపహాడ్, ఆగస్టు 26 : అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను బూర్గంపహాడ్ పోలీసులు బుధవారం పట్టుకున్నారు. బూర్గంపహాడ్ ఎస్సీ కాలనీ పరిధిలోని కిన్నెరసాని వాగు నుండి అక్రమంగా ఇసుకను ట్రాక్టర్లో లోడు చేసుకుని వస్తుండగా ఎస్ఐ నాగభిక్షం తెల్లవారుజామున పట్టుకుని స్టేషన్‌కు తరలించారు. ఇసుక అక్రమ రవాణా జరుగుతుందన్న సమాచారంతో ఎస్ఐ సిబ్బందితో అక్కడకు చేరుకుని ఇసుక లోడ్‌తో ఉన్న ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.