రామవరం, జూన్ 26 : విశ్వాసపూర్వకంగా, నిబద్ధతతో సేవలందించిన సెక్యూరిటీ ఆఫీసర్ వంగళ శ్రీనివాస్ మరణం తీరని లోటు అని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ శాలెం రాజు అన్నారు. ఇటీవల అనారోగ్యంతో మరణించిన శ్రీనివాస్ సంతాప సమావేశం గురువారం కొత్తగూడెం ఏరియాలో జనరల్ మేనేజర్ షాలెం రాజు అధ్యక్షతన జీఎం కార్యాలయం, విభాగాధిపతులు, అన్ని విభాగాల ఉద్యోగుల సమక్షంలో జరిగింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. సంస్థకు శ్రీనివాస్ దాదాపు 37 సంవత్సరాలుగా సేవలందించడమే కాకుండా నిబద్ధత, క్రమశిక్షణ, సేవాపరతకు చిరునామాగా నిలిచిన వ్యక్తి అని కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్ ఓ టు జిఎం జివి కోటిరెడ్డి, ఏరియా ఇంజినీర్ కె.సూర్యనారాయణ రాజు, ఏజిఎం (ఫైనాన్స్) కె.హన సుమలత, డి.జి.ఎం. (పర్సనల్) గామలపాటి వెంకట మోహన్ రావు, డిజిఎం (ఐఈడి) ఎన్.యోహాన్, ఏరియా రక్షణాధికారి ఎం.వెంకటేశ్వర్లు, జిఎం ఆఫీస్ ఐఎన్టియూసి పిట్ సెక్రటరీ సిహెచ్.సాగర్, వివిధ విభాగాల అధిపతులు, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.