రామవరం, మార్చి 29 : రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ, ఈబీసీ, దివ్యాంగ విద్యార్థులు ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు తేదీని మే 31వ తేదీ వరకు పొడిగించడం జరిగిందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనారిటీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎండీ యాకుబ్ పాషా శనివారం తెలిపారు. 11,88,120 ధరఖాస్తుల లక్ష్యం కాగా ఇప్పటి వరకు 10,34,074 మంది ధరఖాస్తులు చేసుకున్నారని, ఇంకా సుమారు 1,54,046మంది ధరఖాస్తు చేసుకోవాల్సి ఉందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం గడువు తేదీని మే 31వరకు పొడిగించటం జరిగిందని తెలిపారు. కావునా ఈ అవకాశాన్ని ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, మైనారిటీ ,దివ్యాంగ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.