రామవరం, జనవరి 10 : సంక్రాంతి థార్మిక పండుగ కాదని, పాడి పంటల పండుగ, రైతుల పండుగ అని, కుల మతాలకు అతీతంగా మనందరి పండుగ అని మోడ్రన్ ఇఖ్రా స్కూల్ కరస్పాండెంట్ షేక్ అబ్దుల్ బాసిత్ అన్నారు. శనివారం రామవరంలోని సుభాష్ చంద్రబోస్ నగర్లోని మోడ్రన్ ఇఖ్రా స్కూల్లో సంక్రాంతి పండుగ సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రైతే దేశానికి వెన్నెముక అని, అన్న ప్రదాత అన్నారు. అలాంటి రైతులు పంట చేతికి వచ్చాకా ఆ పై వాడికి కృతజ్ఞతలు తెలిజేస్తూ జరుపుకునే పండుగ సంక్రాంతి అని అన్నారు. రైతులు సంతోషంగా ఉంటేనే మనమంతా సుఖసంతోషాలతో ఉంటామని, అలాంటి రైతన్నల పండుగ సంక్రాంతిని కులమతాలకు అతీతంగా గౌరవించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన అధ్యాపకురాలు పర్వీన్ సుల్తానా, ఉపాధ్యాయినీలు లక్ష్మీ ప్రసన్న, నీలా, అనితా, సరస్వతీ, శిరీషా, నసరత్, నాజియా, సల్మా, జేఫీషా, లతీఫా, ఖాజా పాల్గొన్నారు.