కొత్తగూడెం అర్బన్, అక్టోబర్ 15 : కార్తీకమాసాన్ని పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం కోసం పంచారామాలకు కొత్తగూడెం ఆర్టీసీ డిపో నుండి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు డిపో మేనేజర్ యూ.రాజ్యలక్ష్మీ బుధవారం తెలిపారు. కొత్తగూడెం నుండి పంచారామాలైనా అమరావతి, భీమవరం, ద్రాక్షారామం, పాలకొల్లు, సామర్లకోటకు సూపర్ లగ్జరీ బస్సులు నడుపుతున్నట్లు, భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ నెల 26వ తేదీ రాత్రి 8 గంటలకు పాల్వంచ నుండి కొత్తగూడెంకు బస్సులు బయల్దేరుతాయని, పెద్దలకు రూ.2,050, పిల్లలకు రూ.1,050 గా నిర్ణయించడం జరిగిందన్నారు. మరిన్ని వివరాలకు 9010374644 నంబర్‌కు కాల్ చేసి సంప్రదించవచ్చన్నారు.