– ముందుకొచ్చిన ప్రవాస భారతీయులు తాళ్లూరి జయశేఖర్-నీలిమ దంపతులు
– అడ్వాన్స్ రూ.2 లక్షలు కమిటీకి అందజేత
బూర్గంపహాడ్, జూలై 09 : బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాకలో కొలువైన శిరిడీ పుష్కర ద్వారక సాయిబాబా మందిరానికి ఆలయ ఊరేగింపు కోసం రథం తయారీకి రూ.3.50 లక్షలు విరాళంగా ఇచ్చేందుకు ప్రవాస భారతీయులు, తానా మాజీ చైర్మన్ తాళ్లూరి జయశేఖర్-నీలిమ దంపతులు ముందుకొచ్చారు. గురువారం ఈ విరాళంలో అడ్వాన్స్ రూ.2 లక్షలను తాళ్లూరి ట్రస్టు డైరెక్టర్ వల్లూరిపల్లి వంశీకృష్ణ-విజయరేణుక దంపతులు ఆలయ కమిటీ నిర్వాహకులకు అడ్వాన్స్‌గా అందజేశారు. ఈ సందర్భంగా దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. అనంతరం వంశీకృష్ణ మాట్లాడుతూ ఆలయ కమిటీ నిర్వాహకుల కోరిక మేరకు ప్రవాస భారతీయులు జయశేఖర్-నీలిమ దంపతులు రథం తయారీకి వితరణ ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. త్వరలోనే ఆలయానికి రథం అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు.