రామవరం, నవంబర్ 28 : పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు భయం లేకుండా, స్వేచ్ఛగా, ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కొత్తగూడెం టూ టౌన్ ఇన్స్పెక్టర్ డి.ప్రతాప్ అన్నారు. పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా టూ టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో శుక్రవారం ఆరుగురు రౌడీషీటర్లను కొత్తగూడెం ఎమ్మార్వో సమక్షంలో బైండోవర్ చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడకుండా ఉండాలనే షరతులతో ఎమ్మార్వో వారి నుండి షూరిటీ తీసుకుని సెల్ఫ్ షూరిటీపై విడుదల చేశారు.