రామవరం, జూన్ 16 : కొత్తగూడెం ఏరియా ఎస్సీ ఉద్యోగుల పదోన్నతులకు సంబంధించిన రోస్టర్ విధానం అమలు తీరు బాగుందని చీఫ్ లైజన్ ఆఫీసర్, మణుగూరు ఏరియా జీ.ఎం డి. రామచందర్, రోస్టర్ పాయింట్ వెరిఫికేషన్ సభ్యులు సంతృప్తి వ్యక్తం చేశారు. పాయింట్ రిజిస్టర్లను తనిఖీ చేసి రోస్టర్ రూల్ ప్రకారం పదోన్నతులు జరుగుతున్నాయో లేదో అని సంబంధిత అధికారులతో సమీక్షించారు. సోమవారం రోస్టర్ రిజిస్టర్ వెరిఫికేషన్ కోసం కొత్తగూడెం ఏరియా జీఎం కార్యాలయానికి వచ్చిన వారికి కొత్తగూడెం ఏరియా యాక్టింగ్ జీఎం ఎం.రమేశ్ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కొత్తగూడెం ఏరియా డీజీఎం (పర్సనల్) గామలపాటి వెంకట మోహన్ రావు వారికి కావలసిన అన్ని వివరాలను అందించారు.
ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ డాక్టర్ ఈ.రాజేశ్వర్, వైస్ ప్రెసిడెంట్ ఎం.వెంకటేశ్వరరావు, జనరల్ సెక్రెటరీ అంతోటి నాగేశ్వర్రావు, కొత్తగూడెం ఏరియా లైజన్ ఆఫీసర్ కలువల చంద్రశేఖర్, డీవై పీఎం గోవర్ధన హరీశ్, సీనియర్ పిఓలు మజ్జి.మురళి, మొహమ్మద్ మాథీన్ హుస్సేన్, సెంట్రల్ కమిటీ మెంబర్స్ పోనగంటి అంకుస్, బందెల విజేందర్, జే. మల్లేశ్, రొంటల సురేశ్, ఎన్.శ్రీనివాస్, ఎం.రామకృష్ణ, కె.ఆంజనేయులు, బి. వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.