467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణను మరింత సమర్థవంతంగా చేపట్టేందుకు నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లా కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను ఎస్పీ రోహిత్ రాజు సోమవారం చుంచుపల్లి పోలీస్ స్టేషన్లో ప్రారంభించారు.
– చుంచుపల్లి పీఎస్‌లో కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభం
చుంచుపల్లి, అక్టోబర్ 12 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణను మరింత సమర్థవంతంగా చేపట్టేందుకు నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లా కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను ఎస్పీ రోహిత్ రాజు సోమవారం చుంచుపల్లి పోలీస్ స్టేషన్లో ప్రారంభించారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఏర్పాటు చేసిన మొత్తం 467 సీసీ టీవీ కెమెరాలను ఈ కేంద్రానికి అనుసంధానం చేశారు. వీటి ద్వారా ఆయా ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షించడం, అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించడం, నేరాల నియంత్రణతో పాటు అత్యవసర సమయాల్లో తక్షణమే స్పందించడం సులభతరం కానుంది.
ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని అవసరమైన ప్రాంతాల్లో మరిన్ని సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు. పోలీసు సేవలను మెరుగుపరిచేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం పర్యావరణ పరిరక్షణలో భాగంగా పోలీసు అధికారులతో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణతో పాటు పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
‘ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం చెల్లించాలి’
Gang Rape Survivor’s Father Killed | అత్యాచారం కేసు వెనక్కి తీసుకునేందుకు నిరాకరణ.. బాధితురాలి తండ్రిని హత్య చేసిన నిందితులు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

