రామవరం, నవంబర్ 19 : కోల్ ఇండియా ఇంటర్ కంపెనీ కబడ్డీ టోర్నమెంట్ ఈ నెల 28, 29, 30 తేదీల్లో రుద్రంపూర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ గ్రౌండ్స్‌లో జరగనుంది. టోర్నమెంట్ నిర్వహణకు అనుమతి ఇచ్చిన సంస్థ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.బలరాంకు కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.శాలెం రాజు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఏడాది కోల్ ఇండియా ఇంటర్ కంపెనీ లెవెల్ కబడ్డీ టోర్నమెంట్ నిర్వహణ బాధ్యతలను కొత్తగూడెం ఏరియాకు కేటాయించిన నేపధ్యంలో బుధవారం జీఎం అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు. కార్పొరేట్ వెల్ఫేర్ వింగ్, స్పోర్ట్స్ అధికారులు, కొత్తగూడెం ఏరియా అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ.. కంపెనీ స్థాయి క్రీడా పోటీలను కొత్తగూడెం ఏరియా మరింత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించి, భవిష్యత్‌లో కూడా ఇలాంటి పోటీలకు ఆతిథ్యం ఇచ్చేలా కృషి చేయాలని సంబంధిత విభాగాధికారులకు సూచించారు. గ్రౌండ్ ప్రిపరేషన్, క్రీడాకారులకు వసతి, భోజన సదుపాయాలు, కబడ్డీ కోర్టు ఏర్పాట్లు, రాత్రి వేళల్లో కూడా మ్యాచ్‌లు నిర్వహించేందుకు ఫ్లడ్‌లైట్ల సౌకర్యం వంటి అంశాలు చర్చించి, విభాగాల వారీగా ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశారు.
ఈ సమావేశంలో ఎస్.ఓ టు జిఎం జీవి కోటిరెడ్డి, డిజిఎం (పర్సనల్) జీవి మోహన్‌రావు, డిజిఎం (ఐఈ) ఎన్.యోహాన్, డిజిఎం (ఈ&ఎం) జె. క్రిస్టఫర్, కార్పొరేట్ డిజిఎం (పర్సనల్) బి.శివకేశవరావు, ఎస్ఓఎం (ఎన్విరాన్మెంట్) టి.సత్యనారాయణ, మెడికల్ సూపరింటెండెంట్ ఎం.పరశురాములు, సివిల్ అధికారి రాజారామ్, డివైపిఎం సునీల్, సీనియర్ పిఓ మజ్జి మురళి, అసిస్టెంట్ స్పోర్ట్స్ సూపర్వైజర్ & ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎంసీ పాస్నైట్, తదితర అధికారులు పాల్గొన్నారు.