భద్రాచలం, మార్చి 15 : మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డిపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తేయాలని బీఆర్ఎస్ భద్రాచలం నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టి అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పార్టీ మండల కన్వీనర్ ఆకోజు సునీల్ కుమార్ మాట్లాడుతూ.. స్పీకర్ మీద జగదీశ్‌రెడ్డి ఎటువంటి ఆరోపణలు చేయలేదన్నారు. కావాలనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సస్పెండ్ చేపించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పార్టీ మండల కో కన్వీనర్ రేపాక పూర్ణచందర్రావు, మండల నాయకులు అయినాల రామకృష్ణ, కాపుల సూరిబాబు, తూతీక ప్రకాశ్, అంబటికర్ర కృష్ణ, నానిపల్లి శ్రీను, బాసిపోయిన మోహన్ రావు, రావూరి రవికిరణ్, బద్ది బాబి, ఇమంది నాగేశ్వరరావు, మురాలడానియల్ ప్రదీప్, మహిళా నాయకురాలు కావూరి సీతామహాలక్ష్మి, పూజల లక్ష్మి,తెల్లం రాణి, గంపల రవికుమారి, స్రవంతి పాల్గొన్నారు.