సుజాతనగర్ : సింగరేణి నిర్లక్ష్యానికి పరాకాష్ట నిమ్మలగూడెం గ్రామపంచాయతీ అని మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు పూల రవీందర్ అన్నారు. మంగళవారం సింగరేణి కొత్తగూడెం ఏరియా జీఎం నరసింహారావును కలిసి వినతి పత్రాన్ని అందించారు. నిమ్మలగూడెం పంచాయతీలో కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వారికి నష్టపరిహారం తోపాటు వైద్య సేవలు అందించాలని కోరారు.
ఉమ్మడి గ్రామ పంచాయతీలో ఒకప్పుడు సుజాతనగర్ పంచాయతీలో నిమ్మలగూడెం గ్రామం దళితవాడగా నిర్లక్ష్యానికి గురై అభివృద్ధికి నోచుకోలేదని, ఈ క్రమంలో సింగరేణి జీకేవోసీ ప్రభావం వల్ల ఓసీలో నిల్వ ఉన్న నీరు మొత్తం నిమ్మలగూడెం గ్రామంలోని 100 ఎకరాల్లో చెరువుగా ఏర్పడి అందులో ఉన్నటు రసాయన, కాలుష్య నీరు వల్ల నిమ్మగూడెం గ్రామంలోని భూగర్భ జలాలు కలుషితమై గ్రామస్తులకుకిడ్నీసమస్యలు తలెత్తుతున్నాయని అన్నారు.
నిమ్మలగూడెం గ్రామాన్ని సింగరేణి యాజమాన్యం దత్తత తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నిమ్మగూడెం గ్రామపంచాయతీ సర్పంచ్ బండి రమేష్, దళిత, గిరిజన నాయకులు లాల్సింగ్ నాయక్, చిన్న వెంకటేశ్వర్లు, భూక్యా రవి తదితరులు పాల్గొన్నారు.