– సీపీఎం ఆధ్వర్యంలో గ్రామస్థుల ఆందోళన
బూర్గంపహాడ్, జూన్ 13 : పినపాక పట్టీనగర్ పంచాయతీ నుంcr ఉప్పుసాక పంచాయతీ జిన్నెగట్టు, ఒడ్డుగూడెం గ్రామాలకు వెళ్లే బీటీ రహదారి ఏడు కిలోమీటర్లు గుంతలు, బురదతో అధ్వాన్నంగా ఉందని.. ఈ రహదారిని తక్షణమే బాగు చేయించాలని సీపీఎం ఆధ్వర్యంలో జిన్నెగట్టు, ఒడ్డుగూడెం గ్రామాల ప్రజలు శనివారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ప్రతి ఏడాది గ్రామసభల సమయంలో రోడ్డు బాగు చేయిస్తామని తీర్మానాలు చేస్తున్నారే తప్ప ప్రభుత్వాలు మారినా ఈ సమస్య పరిష్కారం కావడం లేదని మండిపడ్డారు.
ఉప్పుసాకలో ఆశ్రమ పాఠశాల ఉండటంతో వందలాది మంది పిల్లలు అక్కడే చదువుకుంటున్నారని, ఆ పిల్లలను చూసేందుకు తల్లిదండ్రులు ప్రతివారం వస్తుంటారని, ఈ రహదారిలో వారు ప్రయాణించాలంటే గోతులు, బురద మధ్యే ప్రయాణం చేయాల్సి వస్తుందని, ఈ రహదారిపై ప్రయాణం నరకంగా మారిందని… ఈ దారిలో ప్రమాదాలు సైతం చోటుచేసుకుంటున్నాయని గుర్తుచేశారు. ఈ విషయంపై పంచాయతీ పాలకులు కానీ… ఐటీడీఏ పీy గానీ స్పందించి ఏడు కిలోమీటర్ల దూరం బీటీ రోడ్డు వేయించి సమస్యను పరిష్కరించాలన్నారు. ఆందోళన చేసిన వారిలో గ్రామస్థులు కుర్సా తిరుపతయ్య, బొల్లి శ్రీను, రవికుమార్, ఎడమ వెంకటేశ్వర్లు, సోడె లక్ష్మి, కుర్స ఎర్రమ్మ పాల్గొన్నారు.