Rekkala Ramakka Jathara | ఆళ్లపల్లి, ఫిబ్రవరి 21 : గిరిజనుల ఆరాధ్య దేవతలైన రెక్కల రామక్క జాతర ఘనంగా మొదలైంది. ఆళ్లపల్లి మండల పరిధిలోని మర్కోడు గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న పెద్దూరు గ్రామంలో రెక్కల రామక్క జాతర మహోత్సవం మంగళవారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. మంగళవారం రాత్రి ఆలయం వద్ద పూజారులు మండే మెలుగు కార్యక్రమం నిర్వహించారు.
ఆదివాసి సాంప్రదాయాలతో పెద్దూరు గ్రామంలో ఎదురుకోలు నిర్వహించి.. వేల్పులొద్ది గుట్ట నుండి సాయంత్రం 6 గంటలకు గర్భగుడికి వచ్చింది. రెక్కల రామక్క గద్దెలపై కొలువు తీరగా బుధవారం రాత్రి ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కుంకుమ పూజలు, అర్చనలు, ఒక్కపొద్దు నిర్వహించారు.
ఈ సందర్భంగా పలు జిల్లాలను నుంచి వచ్చే వడ్డెలు వేల్పులను గుడికి చేర్చారు. గురువారం(ఈ రోజు) సాయంత్రం నాలుగు గంటలకు దేవత వనం నుంచి గర్భగుడికి రావడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పినపాక ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పటేల్, ఐటీడీఏ పిఓబి రాహుల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ అధికారి రోహిత్ రాజ్ పాల్గొన్నట్లు కమిటీ వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మాజీ జెడ్పీటీసీ కొమరం హనుమంతరావు, కొమరం సత్యనారాయణ, మంగపేట మాజీ ఎంపీపీ కొమరం రామ్మూర్తి, కొమరం సురేందర్, కొమరం వెంకటేశ్వర్లు, కొమరం రాంబాబు, పాయం నరసింహారావు, రామ్మూర్తి, సతీష్, పూజారులు కొమరం కనకయ్య, కొమరం సీతయ్య, లాలయ్య, రఘు బాబు, రవి, ఎమ్మెల్యే పీఏ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
Bhairavam Theme | బెల్లంకొండ శ్రీనివాస్ ఉగ్రరూపం.. భైరవం థీమ్ సాంగ్ స్టన్నింగ్ లుక్ వైరల్