బూర్గంపహాడ్, ఏప్రిల్ 09 : బీఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు జన్మదినం సందర్భంగా బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాక శ్రీసాయిబాబా ఆలయంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గోపిరెడ్డి రమణారెడ్డి ఆధ్వర్యంలో గురువారం పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తుల అన్నదానం కోసం 25 కిలోల బియ్యం వితరణగా అందజేశారు. రానున్న రోజుల్లో రేగా మరిన్ని పదవులు చేపట్టాలని, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని సాయిబాబాకు పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో 10వ వార్డు సభ్యులు పాటి అశోక్, మండల యువజన ఉపాధ్యక్షుడు ఖాదర్, పట్టణ యువజన అధ్యక్షులు భూక్యా కృష్ణ, బొబ్బిలి, దాసు, రంజిత్, శ్రీను పాల్గొన్నారు.