దుమ్ముగూడెం : కాంగ్రెస్ పార్టీ(Congress) తప్పుడు హామీలతో ప్రజలను మోసం చేసింది. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు(Rega Kantarao) అన్నారు. భద్రాచలం నియోజకవర్గ పర్యటనలో భాగంగా దుమ్ముగూడెం మండలంలోని తురుబాక, రామారావుపేట, కొత్తగూడెం, సింగవరం, దంతెన గ్రామ పంచాయతీల బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని అయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలను తప్పుడు హామీలతో మభ్యపెట్టిందన్నారు.
కాంగ్రెస్ పాలనపై అన్ని వర్గాల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. ఊరూరా గులాబీ జెండాలు ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రావులపల్లి రాంప్రసాద్, మానె రామకృష్ణ, వాసురాజు, దుమ్మగూడెం బీఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ కణితి రాముడు, కోకన్వీనర్ ఎండీ జానీ పాషా, తదితరులు పాల్గొన్నారు.