– కృష్ణసాగర్ సర్పంచ్ తాటి వాణి
బూర్గంపహాడ్, జూన్ 19 : ప్రతి విద్యార్ధి అక్షర జ్ఞానంతో అనుకున్న లక్ష్యాన్ని అధిగమించి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని బూర్గంపహాడ్ మండలం కృష్ణసాగర్ సర్పంచ్ తాటి వాణి అన్నారు. శుక్రవారం పంచాయతీ పరిధిలోని ఎస్సీ కాలనీ ఎంపీపీఎస్ పాఠశాలలో విద్యార్ధులకు పాఠ్య పుస్తకాలతో పాటు నోటు పుస్తకాలను ఉప సర్పంచ్ భూక్యా మోహన్‌రావుతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలను ఉన్నత స్థాయిలో చూడాలని అనుకుంటారని, అందుకు తగినట్లుగా ప్రతి విద్యార్ధి కష్టపడి చదివి పాఠశాలకు, గ్రామానికి, తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నాగిరెడ్డి, హెచ్ఎం, ఉపాధ్యాయులు, పాలకవర్గ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.