టేకులపల్లి, జనవరి 13 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం సులానగర్ గ్రామ పంచాయతీలో సర్పంచ్ లక్ష్మనాయక్ ఆధ్వర్యంలో మకర సంక్రాంతి ముగ్గుల పోటీలను మంగళవారం నిర్వహించారు. సులానగర్లో నిర్వహించిన పోటీల్లో గ్రామ మహిళలు, యువతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో టేకులపల్లి సర్పంచ్ బోడ బాలు నాయక్, జ్యోతి, బీఆర్ఎస్ మండల మహిళా అధ్యక్షురాలు రేణుక, ఏఓ ఎన్.అన్నపూర్ణ, గ్రామ పంచాయతీ కార్యదర్శి పవిత్ర, ఉప సర్పంచులు వసంత, చెన్నయ్య, ఐదో వార్డు మెంబర్ సరిలాల్, అంగన్వాడీ టీచర్ పద్మ, గుండా రవీందర్ రెడ్డి, అరవ అప్పయ్య, అరవ గోపాల్ రావు, లక్పతి, వీరస్వామి, దాసోజు భాస్కరాచారి పాల్గొన్నారు.

Tekulapalli : సులానగర్లో ఉత్సాహంగా ముగ్గుల పోటీలు