ఇల్లెందు, మే 13 : రాష్ట్రంలోని నిరుద్యోగులకు వరం రాజీవ్ యువ వికాస పథకం అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం ముత్యాలంపాడు క్రాస్ రోడ్డు వద్ద 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రానికి స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్యతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ బ్యాంక్ క్రెడిట్ స్కోరింగ్ తో సంబంధం లేకుండా పథకాన్ని అర్హులైన ప్రతి ఒక్కరికి అందజేస్తామని తెలిపారు.
అలాగే ఇల్లెందు నియోజకవర్గానికి సీతారామ నీళ్లు వచ్చేలా కృషి చేయనున్నట్లు చెప్పారు. ప్రస్తుతానికి రైతు రుణమాఫీ 2 లక్షల లోపు మాత్రమే జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, రాష్ట్ర అటవీ కార్పొరేషన్ చైర్మన్ పొద్దెం వీరయ్య, జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్, సింగరేణి సీఎండీ బలరాం, జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, ఐటీడీఏ పీఓ రాహుల్, డీఆర్డీఏ విద్యా చందన, విద్యుత్ శాఖ అధికారులు, నాయకులు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.
Yellandu : నిరుద్యోగులకు వరం రాజీవ్ యువ వికాసం పథకం : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క