రామవరం, అక్టోబర్ 18 : వినియోగదారులకు నాణ్యమైన బొగ్గును సరఫరా చేసేందుకు తగు చర్యలు తీసుకోవాలని, బొగ్గు ఉత్పత్తి, రవాణా రోజు వారి లక్ష్యాలను అధిగమించి రవాణాకు ఎటువంటి ఆటంకాలు కలుగకుండా ముందస్తు జాగ్రతలతో బొగ్గు ఉత్పతి అయ్యేలా చూడాలని సింగరేణి సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కోల్ మూమెంట్) చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ బాదావత్ వెంకన్న అన్నారు. శనివారం కొత్తగూడెం ఏరియాలో ఆయన పర్యటించారు. కొత్తగూడెం ఏరియాలోని ఆర్.సి.హెచ్.పి, వికే కోల్ మైన్ అలాగే అనుమతులు రానున్న వికే సి.హెచ్.పి లను వివిధ విభాగాధిపతులతో కలిసి పరిశీలించారు. ముందుగా కొత్తగూడెం ఏరియాలోని ఆర్.సి.హెచ్.పి నందు గల కార్యాలయంలో ఆర్.సి.హెచ్.పి ప్లాన్ ను తనిఖీ చేసి అనంతరం వాగన్ లోడింగ్ పాయింట్ ను పివికే బంకర్ లోడింగ్ అలాగే జీ -6 కోల్ బాడీ వెహికల్ లను తనిఖీ చేశారు.
కోయగూడెం నుండి వస్తున్న ఓసి బొగ్గును తనిఖీ చేసి జీ -6, జీ-14 ఇతర గ్రేడ్లను ఎలా గుర్తిస్తున్నారో సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు వీకేసీఎం వ్యూ పాయింట్ ను తనిఖీ చేశారు. నూతనంగా అనుమతులు రానున్న వీకే సి హెచ్ పి లను కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్, సంబంధిత ప్రాజెక్ట్ ఆఫీసర్లు ఉపరితల గనుల వివరాలను వివరించారు. ఈ సందర్భంగా రోజు వారి బొగ్గు ఉత్పత్తి, రవాణా, ఓబి బ్లాస్టింగ్, లోడింగ్ పనులను జీఎం ఎం.శాలెం రాజును అడిగి తెలుసుకున్నారు. అలాగే ఉపరితల గనుల్లో ఉద్యోగులకు రక్షణ పరమైన జాగ్రత్తలతో బొగ్గు ఉత్పత్తి తీయాలని సూచించారు.
రైలు మార్గం ద్వారా జరుగుతున్న బొగ్గు రవాణాను పరిశీలించారు. బొగ్గు గ్రేడ్ లను పరిశీలించి నాణ్యమైన బొగ్గును సరఫరా చేయాలనీ సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఇంజినీర్ కె.సూర్యనారాయణ రాజు, ఏజీఎం సివిల్ సీహెచ్ రామకృష్ణ, వీకే సీఎం ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎం.రమేశ్, ఏజెంట్ పద్మావతి ఖని రామ్ భరోస్ మహాతో, మేనేజర్ పద్మావతి ఖని ఎం వి ఎన్ శ్యాంప్రసాద్, ఇన్చార్జి ఆర్.సి.హెచ్.పి అజ్మీర శ్రీనివాస్, ఇతర అధికారులు పాల్గొన్నారు.