బూర్గంపహాడ్, మే 15 : బూర్గంపహాడ్ మండలంలో మేజర్ పంచాయతీగా ఉన్న సారపాకలో ప్రజా సమస్యలు పరిష్కరించాలని వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మహిళా నాయకులు శుక్రవారం పంచాయతీ కార్యాలయంలో సిబ్బందికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం మండల కార్యదర్శి ఎస్.అబీదా మాట్లాడుతూ పంచాయతీలోని సుందరయ్యనగర్లో సీసీ రోడ్డు వేశారని… కొన్ని సీసీ రోడ్లు మిగిలిపోయాయని తక్షణమే వాటిని వర్షాకాలం రాకముందే నిర్మించాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పనిలో రెండు ఫొటోలు తీసే పద్ధతిని రద్దు చేయాలన్నారు. ఐరీష్ పద్ధతి కూడా రద్దు చేసి పాత పద్ధతిని కొనసాగించాలని, అర్హులైన కూలీలకు జాబ్ కార్డులు ఇవ్వాలని, పెండింగ్ బిల్లులు తక్షణమే ఇవ్వాలని వినతిలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కనకం వెంకటేష్, నాగమణి, సహేదా, రమ, ముంగి లక్ష్మి, మౌలాంబి, షాకీరా పాల్గొన్నారు.