నల్ల బ్యాడ్జీలతో కార్మిక జేఏసీ ఆధ్వర్యంలో నిరసన
కార్మిక సమస్యలు తక్షణం పరిష్కరించాలని కార్మిక జేఏసీ ఆధ్వర్యంలో శనివారం ఐటీసీ కర్మాగారం అడ్మిన్ బ్లాక్ వద్ద పెద్ద ఎత్తున కార్మికులు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. 13వ వేతన ఒప్పందంలో పెండింగ్ సమస్యలు పరిష్కరించడం లేదని, 14వ వేతన ఒప్పందం..
బూర్గంపహాడ్, ఏప్రిల్ 18 : కార్మిక సమస్యలు తక్షణం పరిష్కరించాలని కార్మిక జేఏసీ ఆధ్వర్యంలో శనివారం ఐటీసీ కర్మాగారం అడ్మిన్ బ్లాక్ వద్ద పెద్ద ఎత్తున కార్మికులు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. 13వ వేతన ఒప్పందంలో పెండింగ్ సమస్యలు పరిష్కరించడం లేదని, 14వ వేతన ఒప్పందం కార్మికులకు ఆమోదయోగ్యంగా రూ.22 వేలకు తగ్గకుండా చేయాలని, కార్మికులందరికీ 100శాతం అన్లిమిటెడ్ మెడికల్ స్కీంను తీసుకు రావాలని డిమాండ్ చేశారు. అడ్మిన్ బ్లాక్లో కార్మికులంతా నల్లబ్యాడ్జీలు ధరించి తమ నిరసన తెలిపారు.
జేఏసీ నాయకులు మాట్లాడుతూ కార్మికులకు కొత్త క్వార్టర్ల నిర్మాణం చేపట్టాలని, షటిల్ కోర్టు, జిమ్ ఏసీ, బైక్ స్టాండ్, లాంగ్ సిక్ కార్మికులకు డిపెండెంట్ ఉద్యోగాలు తదితర సమస్యలు ఐటీసీ యాజమాన్యం తక్షణమే పరిష్కరించాలని, లేనిపక్షంలో కార్మిక జేఏసీ తీసుకునే వ్యతిరేక నిర్ణయాలకు గుర్తింపు సంఘం, యాజమాన్యం పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్మికులు, కాంట్రాక్టు కార్మిక సంఘం నాయకులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | పిల్లలకు ఇంటర్నెట్పై నిషేధం తగదు.. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
FSSAI | బిస్కెట్లలో దాణా.. పాలల్లో డిటర్జెంట్.. మూడు కంపెనీలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కేసులు
Uttarakhand | సీఎం సార్..నా భార్య అవినీతి లెక్క తేల్చండి..! ఉత్తరాఖండ్ మహిళా మంత్రిపై భర్త ఆరోపణలు
RTC Elections | ఆర్టీసీ ఎన్నికల ఫలితాలు తారుమారు?.. కాంగ్రెస్ అనుబంధ సంఘానికి కట్టబెట్టే యత్నం
Delhi Police | పోలీసుల దాష్టీకాలపై కదం తొక్కిన మహిళలు.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

