పాల్వంచ, సెప్టెంబర్ 11 : తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ జాయింటు యాక్షన్ కమిటీ కె.టి.పి.ఎస్ ఐదు, ఆరవ దశల ఆధ్వర్యంలో యాదాద్రి పవర్ ప్లాంట్ (వైటి.పి.ఎస్)లోని కోల్, యాష్ హ్యాండ్లింగ్ విభాగాలను ప్రైవేటీకరణ సంబంధించి టెండర్లు పిలవడానికి నిరసిస్తూ, వ్యతిరేకంగా చీఫ్ ఇంజినీర్ ఛాంబర్ లో నేలపై బైఠాయించి ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. కార్మికులు ఇంజినీర్లు ఉద్యోగులు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వీరకు చీఫ్ ఇంజినీర్ చాంబర్ లోపల నేల వీంద కూర్చొని నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ… గత నెల 29వ తేదిన జరిగిన జాయింట్ మీటింగ్లో ప్రభుత్వంతో మాట్లాడి 15 రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని చెప్పారు.
కానీ అందుకు విరుద్దంగా టీజీ జెన్కో యాజమాన్యం టెండర్ల ప్రక్రియను పైనలైజ్ చేసి పవర్ మెక్ అనే కంపెనీకి టెండర్లు ఇవ్వబోతున్నట్లు ఆరోపించారు. యాజమాన్యం ఉద్యోగ సంఘాల ఉద్యోగ కార్మిక సంఘాల లో ఆధ్వర్యంలో చేసిన డిమాండ్ ను పరిగణలోకి తీసుకోకుండా టెండర్ల ప్రక్రియను పూర్తి చేయడం పట్ల నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జనరేషన్స్ స్టేషన్లలో నిరసన కార్యక్రమం చేపట్టినట్లు వెల్లడించారు. పాల్వంచలోని కేటీపీఎస్ కర్మాగారంలో జరిగిన నేసన కార్యక్రమంలో జేఏసీ నాయకులు ఉమామహేశ్వరరావు, ఎం.శ్రీనివాసరావు, సీహెచ్.భాగ్యరాజ్, అఖిల్, శ్రీపాల్, కోటేశ్వరరావు, పుల్లారావు, సురేంద్రాచారి, రాదా కృష్ణ యాదగిరి, రాజాబాబు, రజిం, రిజ్యానా, నాగేశ్వరరావు, రాయదాసు పాల్గొన్నారు.