-ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు సర్పంచ్, ఉప సర్పంచుల వినతి
బూర్గంపహాడ్, జూన్ 04 : బూర్గంపహాడ్ మండల పరిధిలోని కృష్ణసాగర్ పంచాయతీలో నెలకొన్న మౌలిక సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును గురువారం క్యాంప్ కార్యాలయంలో కలిసి సర్పంచ్ తాటి వాణి, ఉప సర్పంచ్ మోహనరావు వినతిపత్రం అందజేశారు. పంచాయతీలో అభివృద్ధి పనులు, తాగునీరు, రహదారులు, డ్రైనేజీ తదితర ప్రజోపయోగకరమైన సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేను కోరారు. దీనికి స్పందించిన ఎమ్మెల్యే పాయం అధికారులతో మాట్లాడి పంచాయతీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యుడు పదం రాజు, స్థానిక నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.