రామవరం, ఆగస్టు 14 : సికిల్సెల్, నీమియా, తలసేమియాను ప్రారంభ దశలోనే గుర్తించడానికి గర్భిణీలు తప్పనిసరిగా హెచ్పీఎల్సీ పరీక్షలు చేయించుకోవాలని భధ్రాద్రి కొత్తగూడెం జిల్లా డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.జయలక్ష్మి అన్నారు. గురువారం కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని రామవరం అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. నాన్-కమ్యూనికబుల్ డిసీజెస్ (ఎన్సిడి)తో బాధపడుతున్న రోగులతో ఆమె మాట్లాడారు. జీవనశైలి మార్పుల ప్రాముఖ్యతను వివరించారు. అందరూ ఆరోగ్యకరమైన అలవాట్లను అవలంభించాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాము నాయక్ (మెడికల్ ఆఫీసర్), డాక్టర్ పుల్లారెడ్డి (ప్రోగ్రామ్ ఆఫీసర్), ఎండీ ఫైజ్మోహియుద్దీన్ (డిప్యూటీ డెమో), శంకరమ్మ, స్ఫూర్తి పాల్గొన్నారు.