– మాజీ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్
ఇల్లెందు, జనవరి 17 : ఇల్లెందు మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలిసి ఇల్లెందు మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగరడం ఖాయమని పార్టీ ఇల్లెందు నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ అన్నారు. శనివారం ఇల్లెందు జే కే సెంటర్ సమీపాన అయ్యప్ప స్వామి ఆలయంలో బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ దిండిగాల రాజేందర్, పార్టీ మాజీ కౌన్సిలర్ తో కలిసి హరిప్రియ నాయక్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 12వ వార్డు నుండి గడప గడపకు ప్రచార కార్యక్రమంలో భాగంగా పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులతో కలిసి బీఆర్ఎస్ పార్టీ పాలనలో గతంలో ఇల్లెందు మున్సిపాలిటీలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఎన్నో దశాబ్దాల ఇల్లెందుకు ఆర్టీసీ బస్సు డిపో కలను నెరవేర్చడం, ఇల్లెందులో 100 పడకల ఆస్పత్రి మంజూరు, ప్రతి వార్డులో నీటి సమస్యను తీర్చి, రోడ్ల నిర్మాణాలు, పట్టణ ప్రకృతి వనాలు, బడుగు బలహీన వర్గాల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఇల్లెందు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీదేనన్నారు.

Yellandu : ‘ఇల్లెందు మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగరడం ఖాయం’
ఈ విషయం పట్టణ ప్రజల అందరికీ తెలుసని, రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి కారణమైన కేసీఆర్, కేటీఆర్, మాజీ మంత్రి అజయ్ లకు కానుకగా ఇవ్వాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు బానోత్ హరిసింగ్ నాయక్, పట్టణ అధ్యక్షుడు అబ్దుల్ జబ్బర్, నాయకులు ఎస్ రంగనాథ్, సిలివేరి సత్యనారాయణ, పరుచూరి వెంకటేశ్వర్లు, అబ్దుల్ నబీ, మాజీ కౌన్సిలర్లు జెకె శ్రీను, కటకం పద్మావతి, తోట లలిత శారద, చీమల సుజాత, తార, కడగంచి పద్మ, వీరస్వామి, కిరణ్, రవితేజ, సునీల్, శ్రీకాంత్, గిన్నారపు రాజేశ్, కాసాని హరిప్రసాద్, సత్తాల హరికృష్ణ, రవికాంత్, మండల ప్రధాన కార్యదర్శి రేణుక, దేవీలాల్ పాల్గొన్నారు.

Yellandu : ‘ఇల్లెందు మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగరడం ఖాయం’